E-Commerce | ఆర్డ‌ర్ చేసిన నాలుగేళ్ల‌కు డెలివ‌రీ.. ఏ సంస్థో తెలుసా?

విధాత‌: ప్ర‌పంచంలో ఈ కామ‌ర్స్ (E-Commerce) వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా ఉన్న‌ప్ప‌టికీ… త‌మ సర్వీసు కార‌ణంగా అవి మంచి పేరో, చెడ్డ పేరో తెచ్చుకుంటాయి. తాజాగా యూజ‌ర్ ఆర్డ‌ర్ చేసిన నాలుగేళ్ల‌కు ఓ ఈ కామ‌ర్స్ సంస్థ.. ఆ పార్సిల్‌ను డెలివ‌రీ చేసింది. నాలుగేళ్ల దాకా దానిని పంప‌నందుకు విమ‌ర్శించాలా లేదా నాలుగేళ్లు గుర్తుపెట్టుకుని ఆ వ‌స్తువును పంపినందుకు ప్ర‌శంసించాలా అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. దిల్లీకి చెందిన నితీశ్ అగ‌ర్వాల్ అనే టెకీ 2019లో చైనా (China) కు […]

  • Publish Date - June 25, 2023 / 10:45 AM IST

విధాత‌: ప్ర‌పంచంలో ఈ కామ‌ర్స్ (E-Commerce) వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా ఉన్న‌ప్ప‌టికీ… త‌మ సర్వీసు కార‌ణంగా అవి మంచి పేరో, చెడ్డ పేరో తెచ్చుకుంటాయి. తాజాగా యూజ‌ర్ ఆర్డ‌ర్ చేసిన నాలుగేళ్ల‌కు ఓ ఈ కామ‌ర్స్ సంస్థ.. ఆ పార్సిల్‌ను డెలివ‌రీ చేసింది. నాలుగేళ్ల దాకా దానిని పంప‌నందుకు విమ‌ర్శించాలా లేదా నాలుగేళ్లు గుర్తుపెట్టుకుని ఆ వ‌స్తువును పంపినందుకు ప్ర‌శంసించాలా అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

దిల్లీకి చెందిన నితీశ్ అగ‌ర్వాల్ అనే టెకీ 2019లో చైనా (China) కు చెందిన దిగ్గ‌జ ఈ కామ‌ర్స్ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ (Ali Express) సైట్‌లో ఒక వ‌స్తువును ఆర్డ‌ర్ పెట్టాడు. ప్ర‌స్తుతం దాని కార్య‌క‌లాపాలను భార‌త్‌లో నిషేధించారు.

అయిన‌ప్ప‌టికీ నాలుగేళ్ల త‌ర్వాత ఇటీవ‌ల ఆ వ‌స్తువును నితీశ్ అందుకున్నాడు. ఆ పార్సిల్ ఫొటోను ట్వీట్ చేస్తూ ఎప్పుడూ ఆశ‌లు వ‌దులుకోవ‌ద్దు అని ట్వీట్ చేశాడు. ఆ పార్సిల్ క‌వ‌ర్‌పై చైనా భాష‌లో ఏదో రాసి ఉండ‌గా.. ఆర్డ‌ర్ తేదీ మే 2019 అని చూపిస్తోంది.

అయితే జూన్ 2020లో అలీ ఎక్స్‌ప్రెస్‌ను భార‌త్‌లో నిషేధించ‌డం విశేషం. దీనిపై యూజ‌ర్లు ప‌లు విధాలుగా స్పందిస్తున్నారు. నేను ఇంత అదృష్ట‌వంతుడ్ని ఎప్పుడ‌వుతానో అని ఒక‌రు స్పందించ‌గా.. మ‌రో యూజ‌ర్ అలీ ఎక్స్‌ప్రెస్ నుంచి త‌న‌కు ఆర్డర్ చేసిన ఎనిమిది నెల‌ల‌కు డెలివ‌రీ వ‌చ్చిందని తెలిపాడు.

త‌క్కువ ధ‌ర‌కు గూడ్స్‌, వివిధ ఉప‌క‌రణాల కొనుగోలుకు అలీ ఎక్స్‌ప్రెస్‌ను భార‌తీయులు విరివిగా ఉప‌యోగించేవారు. దీనిపై మీరేమంటారు? అలీ ఎక్స్‌ప్రెస్‌ను విమ‌ర్శిస్తారా? అభినందిస్తారా?