Diabetes: షుగర్ పేషెంట్లకు హై అలర్ట్.. పొంచి ఉన్న మరో ముప్పు

Diabetes: హైదరాబాద్: డయాబెటిస్ అనేది కేవలం స్ట్రోక్ లేదా గుండె జబ్బులకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఎముకలు, కీళ్లను కూడా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైపర్‌గ్లైసీమియా (Hyperglycemia) లేదా అధిక రక్త గ్లూకోస్ స్థాయి ఎముకల బలహీనత, కీళ్ల నొప్పి, గాయాలు నెమ్మదిగా మానడం వంటి సమస్యలకు ప్రధాన కారణమవుతుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్ (Osteoarthritis) (కీళ్లలో నొప్పి, బిగుసుకుపోవడం, వాపుతో కూడిన డీజనరేటివ్ వ్యాధి), ఫ్రోజెన్ షోల్డర్ (Frozen shoulder) (భుజం కీలు కదలికలను పరిమితం […]

Diabetes:

హైదరాబాద్: డయాబెటిస్ అనేది కేవలం స్ట్రోక్ లేదా గుండె జబ్బులకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఎముకలు, కీళ్లను కూడా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైపర్‌గ్లైసీమియా (Hyperglycemia) లేదా అధిక రక్త గ్లూకోస్ స్థాయి ఎముకల బలహీనత, కీళ్ల నొప్పి, గాయాలు నెమ్మదిగా మానడం వంటి సమస్యలకు ప్రధాన కారణమవుతుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్ (Osteoarthritis) (కీళ్లలో నొప్పి, బిగుసుకుపోవడం, వాపుతో కూడిన డీజనరేటివ్ వ్యాధి), ఫ్రోజెన్ షోల్డర్ (Frozen shoulder) (భుజం కీలు కదలికలను పరిమితం చేసే అడెసివ్ క్యాప్సులైటిస్) వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రముఖ వైద్యడు ఒకరు మాట్లాడుతూ.. డయాబెటిస్ ఉన్నవారిలో మోకాలి ఆస్టియోఆర్థరైటిస్, లిగమెంట్ గాయాలు వచ్చే ప్రమాదం ఎక్కువని, కాబట్టి కీళ్లను కాపాడుకోవడం డయాబెటిస్ రోగులకు ముఖ్యమైన అంశమని చెప్పారు.

ఈ ప్రభావాలు:

ఇలా చేయండి:
కాల్షియం మరియు విటమిన్ లభించే ఆహారాన్ని తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, గింజలు, చేపలను భోజనంలో చేర్చుకోండి. చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తినవద్దు. నడక, రెసిస్టెన్స్ ట్రైనింగ్, యోగా వంటి రోజువారీ కార్యకలాపాలు ఎముకల బలాన్ని, కీళ్ల సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. సైక్లింగ్, ఈత కూడా కీళ్ల నొప్పి ఉన్నవారికి మంచిది. ధూమపానం, మద్యపానాన్ని మానేసి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతాయి.

చికిత్స:
వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో, రోబోటిక్ మోకాలి రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స చేయవచ్చు. ఈ ఇన్వేసివ్ సర్జరీ మోకాలి కీలు రీప్లేస్‌మెంట్‌లో ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. ఇది త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న డయాబెటిక్ రోగులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆర్థ్రోస్కోపిక్ ప్రక్రియ సంప్రదాయ సర్జరీ కంటే తక్కువ ప్రమాదంతో కీళ్లు దెబ్బతినడాన్ని సరిచేస్తాయి. డయాబెటిస్ రోగులలో ఎముకలు, కీళ్ల సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. రెగ్యులర్ బోన్ స్కాన్‌లు, కీళ్ల తనిఖీలు, వార్షిక చెకప్‌లు సమస్యలను ముందుగా గుర్తించి, కదలికల నష్టాన్ని నివారిస్తాయి.