Site icon vidhaatha

Digital signatures | ఏపీలో.. డిజిటల్ సంతకాలు చోరీ!

Digital signatures

విధాత‌: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విచిత్రమైన చోరీ జరిగింది.. ఎవరైనా దొంగలు డబ్బు నగలు దొంగిలిస్తారు. కానీ ఈ ఇంటి దొంగలు ఏకంగా ఉన్నతాధికారులు డిజిటల్ సంతకాలు ఎత్తుకెళ్లి తమకు నచ్చిన విధంగా వాడుకుని డబ్బులు వసూలు చేశారు. ఈమేరకు ఐదుగురు ఉద్యోగులను సీఐడీ అరెస్ట్ చేసింది.

ఐఎఎస్ అధికారులు వద్ద పనిచేసే గుమస్తా స్థాయి ఉద్యోగులు CMO లో ఉన్న సేక్రేటేరీస్ ల ఇ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్వర్డ్ వినియోగించి MLA, MP ల అభ్యర్ధనలను సేక్రేటేరీస్ కి తెలియకుండా CMP లుగా తయారీ చేసి ఇ-ఆఫీస్ ద్వారా వారి డిజిటల్ సంతకాలను ఉపయోగించి CMP లను సంబంధిత శాఖలకు ఫైల్స్ పై చర్యల నిమిత్తం పంపేవారు.

ఇందులో ప్రధమ ముద్దాయి అయిన కనమర్ల శ్రీను (ముత్యాల రాజు IAS గారి పేషి లో మాజీ DEO) గత కొన్నాళ్లుగా అతనికి తెల్సిన ఇ- ఆఫీస్ లోని పరిజ్ఞానంను ఉపయోగించి తన వ్యక్తీగత ఆర్ధిక ప్రయోజనాల కొరకు కొన్ని CMP లను సంబంధిత CMO సెక్రెటరీలకు తెలియకుండా ఇ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ దొంగిలించి ఏ శాఖకు కావాలంటే ఆ శాఖ సెక్రెటరీ టు CM సంతకాలను కాపీ , పేస్ట్ చేసి పంపించేవాడు.

సదరు అభ్యర్ధనలను సంబంధిత శాఖలకు పంపడానికి కొరకు login credentials కొరకు అలాగే ఈ-ఆఫీస్ లో ప్రాసెసింగ్ చేయడానికి కనమర్ల శ్రీను, నలజల సాయి రామ్ (జవహర్ రెడ్డి గారి పేషి వద్ద డి.యి.ఓ), గుత్తుల సీతారామయ్య (ధనుంజయ రెడ్డి గారి యొక్క పేషిలో attender), DEO చైతన్య (ముత్యాలరాజు IAS గారి పేషి) అలాగే అబ్దుల్ రజాక్ (జవహర్ రెడ్డి గారి పేషి వద్ద డి.యి.ఓ) లు కలిసి ఒక పథకం ప్రకారం అభ్యర్ధి యొక్క అర్జీ మరియు సంబంధిత MLA, MP /Ministers యొక్క అబ్యర్ధన లేఖలను సేకరించడం తరువాత దాన్ని ఈ-ఆఫీస్ నందు అప్లోడ్ చేయ్యడం, ప్రాసెస్ చేసినందుకు డబ్బులు తీసుకుని పంచుకోవడం చేసారు

అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల ఆఖరులో ముత్యాలరాజు IAS గారి పేషి లో పని చేస్తున్న DEO కనమర్ల శ్రీను తయారు చేసిన హోం డిపార్ట్మెంట్ కి చెందిన ఒక CMP సర్క్యులేట్ అయ్యి ధనుంజయ రెడ్డి గారి పేషి కి రాగా దానిని అనుమానంపై క్రాస్ చెక్ చేసుకుని ఈ పని కనమర్ల శ్రీనునే చేశాడని, శాఖపరమైన విచారణ చేసి నిర్ధారించుకుని అతనిని ఉద్యోగం నుండి తొలగించారు.

ఉద్యోగం లోనుండి తొలగించిన తర్వాత కూడా శ్రీను ముత్యాల రాజు గారి పేషి లో పని చేసే DEO చైతన్య సహకారంతో లాగిన్ పాస్ వర్డ్ తెలుసుకుని మరో మూడు CMP లను ముత్యాల రాజు IAS గారి ఈ-ఆఫీసు లాగిన్ నుండి వివిధ శాఖలకు పంపగా వెంటనే PS నారాయణస్వామి తెలుసుకుని ఆ ఫైల్స్ ను వెనక్కి (pull back) తీసుకున్నారు.

ఈ పని కూడా శ్రీను నే చేసినట్లు వాళ్ళు ప్రాధమికంగా నిర్ధారించుకుని, మిగిలీన CMO లోని Secretaries వారి వారి శాఖలలోని logins ని చెక్ చేసుకోగా సుమారుగా 66 CMP లు ఫేక్ గా గుర్తించారు. ​ఈ విచారణలో ఈ అయిదుగురు యొక్క పాత్ర పైన శాస్త్రీయంగా దర్యాప్తు చేసి ఒకరితో ఒకరికి సంబంధాలు ఉన్నాయని అదే విధంగా ఫైల్ ప్రాసెసింగ్ కి వీళ్ళ మధ్య ఆర్ధిక లావాదేవిలు జరిగినట్లు గుర్తించారు.

Exit mobile version