Cancer | మ‌నుషుల్లో కేన్స‌ర్‌ను ముందే ప‌సిగ‌డుతున్న కుక్క‌లు, చీమ‌లు

Cancer విధాత‌: త్వ‌ర‌గా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు… కేన్స‌ర్ (Cancer) రోగుల విష‌యంలో డాక్ట‌ర్లు త‌ర‌చూ చెప్పే మాట ఇది. అందుకే కేన్స‌ర్‌ను వీలైనంత త్వ‌ర‌గా గుర్తించ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌న‌కు కేన్స‌ర్ వ‌స్తుంద‌ని గానీ, వ‌చ్చిన తొలి రోజుల్లో గానీ గుర్తించే సామ‌ర్థ్యం మాన‌వ‌మాత్రుల‌కు ప్ర‌స్తుతానికి లేదు. అయితే శున‌కాలు (Dogs) , చీమ‌లు (Ants) , కొన్ని పురుగులు (Worms) మ‌నుషుల‌కు కేన్స‌ర్ వ‌స్తున్న‌ట్లు ముందుగానే గుర్తించ‌గ‌ల‌వ‌ని నేష‌న‌ల్ జియోగ్ర‌ఫిక్‌లో ప్ర‌చురిత‌మైన […]

  • Publish Date - July 8, 2023 / 11:23 AM IST

Cancer

విధాత‌: త్వ‌ర‌గా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు… కేన్స‌ర్ (Cancer) రోగుల విష‌యంలో డాక్ట‌ర్లు త‌ర‌చూ చెప్పే మాట ఇది. అందుకే కేన్స‌ర్‌ను వీలైనంత త్వ‌ర‌గా గుర్తించ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌న‌కు కేన్స‌ర్ వ‌స్తుంద‌ని గానీ, వ‌చ్చిన తొలి రోజుల్లో గానీ గుర్తించే సామ‌ర్థ్యం మాన‌వ‌మాత్రుల‌కు ప్ర‌స్తుతానికి లేదు. అయితే శున‌కాలు (Dogs) , చీమ‌లు (Ants) , కొన్ని పురుగులు (Worms) మ‌నుషుల‌కు కేన్స‌ర్ వ‌స్తున్న‌ట్లు ముందుగానే గుర్తించ‌గ‌ల‌వ‌ని నేష‌న‌ల్ జియోగ్ర‌ఫిక్‌లో ప్ర‌చురిత‌మైన ఒక అధ్య‌య‌నం పేర్కొంది.

ఎలా ..?

కేన్స‌ర్‌ వంటి రోగాలు.. మ‌నుషుల చ‌ర్మం, శ్వాస‌, ద్ర‌వాల నుంచి కొన్ని ర‌కాల ర‌సాయ‌న ప‌దార్థాలు విడుదల‌య్యేలా చేస్తాయి. వీటిని వైద్య ప‌రిభాష‌లో వోల‌టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ) అంటారు. సాధార‌ణంగా విడుద‌ల‌య్యే వీఓసీల కంటే కేన్స‌ర్ రానున్న లేదా వ‌చ్చిన వారిలో విడుద‌ల‌య్యే వీఓసీల వాస‌న కొంచెం తేడాగా ఉంటుంది.

కుక్క‌లు ఎలా ప‌సిగ‌డ‌తాయి?

కుక్క‌లు చ‌ర్మ, రొమ్ము, పేగు కేన్స‌ర్‌ల‌ను బాగా గుర్తించ‌గ‌ల‌వ‌ని నేష‌న‌ల్ జియోగ్ర‌ఫిక్ అధ్య‌య‌నం (National Geographic Study) వెల్ల‌డించింది. కుక్క‌ల్లోని జాతుల‌ను బ‌ట్టి అవి ర‌క‌ర‌కాల కేన్స‌ర్‌ల‌ను గుర్తించ‌గ‌ల‌వ‌ని పెన‌స‌ల్వేనియా స్కూల్ ఆఫ్ వెట‌ర్న‌రీ మెడిసిన్ తెలిపింది. తాము ఒక కుక్కకు గ‌ర్భాశ‌య ముఖ కేన్స‌ర్‌ను గుర్తించేందుకు శిక్ష‌ణ ఇవ్వ‌గా 70 శాతం క‌చ్చిత‌త్వంతో అది ఆ కేన్స‌ర్ రోగుల‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించింది.

యూరిన్ వాస‌న‌ను విశ్లేషించ‌డం ద్వారా ఆరోగ్యంతో ఉన్న వారిని, కేన్స‌ర్‌తో ఉన్న వారిని అది ప‌సిగ‌ట్టినట్లు శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు. అయితే ప‌రిమిత సంఖ్య‌లో న‌మూనాలన ప‌రిశీలిస్తున్న‌పుడు వీటి ప‌నితీరు బాగున్న‌ప్ప‌టికీ అసంఖ్యాక‌మైన న‌మూనాలను ఇచ్చిన‌పుడు వ‌చ్చే ఫ‌లితాలపై ఇంకా ప‌రిశోధ‌న జ‌ర‌గాల్సి ఉంది. ఇందులో విజ‌యవంత‌మైతేనే క్షేత్ర‌స్థాయిలో వీటి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోగ‌ల‌మ‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు.

చీమ‌లు కూడా..

బ్రెస్ట్ కేన్స‌ర్‌ను ప‌సిగట్ట‌డంలో సిల్కు చీమ‌లుగా పిలుచుకునే ఫార్మికా ఫ‌స్కా చీమలు నేర్ప‌రిత‌నాన్ని చూపిస్తున్నాయ‌ని ఈ అధ్యయ‌నం వెల్ల‌డించింది. బ్రెస్ట్ కేన్స‌ర్ ట్యూమ‌ర్‌ల‌ను ఎక్కించిన ఎల‌క‌ల యూరిన్‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ఎల‌క‌ల యూరిన్‌ను ఈ చీమ‌ల ద‌గ్గ‌ర శాస్త్రవేత్త‌లు పెట్టారు. కొద్ది సేప‌టి త‌ర్వాత ఆ చీమ ట్యూమ‌ర్ అవ‌శేషాల‌ను క‌లిగిఉన్న ఎల‌క యూరిన్ ద‌గ్గ‌ర‌కే వెళ్ల‌డాన్ని గ‌మ‌నించారు. చీమ‌ల ప‌నిత‌నం చూసి త‌మ‌కు ఆశ్చ‌ర్యం క‌లిగింద‌ని అధ్య‌య‌నానికి నాయ‌క‌త్వం వ‌హించిన బాప్టిస్టిక్ పిక‌రెట్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఒక్కో చీమ‌కు ఇలా శిక్ష‌ణ ఇవ్వ‌డానికి 10 నిమిషాల కంటే ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేద‌ని తెలిపారు.

కుక్క‌ల‌తో పోలిస్తే వీటిని పోషించ‌డం కూడా తేలికేన‌ని.. కాస్త తేనె, కొన్ని చ‌నిపోయిన కీట‌కాలు వాటికి ఆహారం ఇస్తే స‌రిపోతుంద‌ని పేర్కొన్నారు. కేనోర్‌హాబ్‌డిటిస్ ఎల‌గ‌న్స్ అనే పురుగులు సైతం ఇలానే కేన్స‌ర్ పేషెంట్ల యూరిన్‌వైపు క‌దులుతూ ఆరోగ్య‌క‌ర‌మైన వారి యూరిన్‌ను ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని నేష‌న‌ల్ జియోగ్ర‌ఫిక్ అధ్య‌య‌నం పేర్కొంది. జ‌పాన్‌లో ఉన్న ఒక బ‌యోటెక్ సంస్థ ఈ పురుగుల‌పై ప‌నిచేస్తోంద‌ని, ఔత్సాహికుల నుంచి యూరిన్‌ను సేక‌రించి పురుగుల‌తో ప‌రిశోధ‌న చేయ‌డం ద్వారా ఈ విధానంలో శాస్త్రీయ‌త‌ను నిర్ధ‌రించుకోడానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలిపింది.

Latest News