Gajakesari Raj Yoga | డిసెంబ‌ర్ 8న గ‌జ‌కేస‌రి యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్యప‌రంగా అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

Gajakesari Raj Yoga | మంగ‌ళ‌క‌ర‌మైన గ‌జ‌కేస‌రి రాజయోగం( Gajakesari Raj Yoga ) డిసెంబ‌ర్ నెల( December Month )లో ఏర్ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో మూడు రాశుల( Zodiac Signs ) వారికి ఆర్థికంగా, ఆరోగ్య‌ప‌రంగా అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌నున్నాయి. ఈ మూడు రాశుల వారికి పట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. మ‌రి ఆ మూడు రాశులేవో తెలుసుకుందాం..

Gajakesari Raj Yoga | జ్యోతిష్య శాస్త్రంలో గ్ర‌హాల క‌ల‌యిక‌, గ్ర‌హాల సంచారం వ‌ల‌న అనేక రాజ‌యోగాలు ఏర్ప‌డుతుంటాయి. అయితే అన్ని రాజయోగాలకంటే చాలా ప్రత్యేకమైన మంగళకరమైన గజకేసరి రాజయోగం( Gajakesari Raj Yoga ) డిసెంబర్( December ) 8వ తేదీన ఏర్పడనుంది. ఆ రోజున చంద్రుడు క‌ర్కాట‌క రాశి( Cancer )లోకి ప్ర‌వేశించ‌నున్నాడు. ఇప్ప‌టికే గురు గ్ర‌హం అదే రాశిలో ఉన్నందున, గురు చంద్ర గ్ర‌హాల సంయోగం ఏర్ప‌డనుంది. దీంతో గ‌జ కేస‌రి రాజ‌యోగం ఏర్ప‌డ‌నుంది. ఈ గ‌జ‌కేస‌రి రాజ‌యోగం వ‌ల‌ను ఈ మూడు రాశుల వారికి పట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. అదృష్టం త‌లుపు త‌ట్ట‌నుంది. మ‌రి ఆ మూడు రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి ( Gemini )

డిసెంబ‌ర్ 8వ తేదీన ఏర్ప‌డే గ‌జకేస‌రి రాజ‌యోగం కార‌ణంగా.. మిథున రాశి వారికి ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. అప్పుల‌న్నీ మాయ‌మై ఆర్థికంగా బ‌లోపేతం అవుతారు. అంతేకాకుండా ఇత‌ర వ్య‌వ‌హారాల్లోనూ చాలా అద్భుతాలు జ‌రుగుతాయి. ఇప్ప‌టికే చేప‌ట్టిన ప‌నుల‌న్నీ సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది

కర్కాటక రాశి( Cancer )

గ‌జ‌కేస‌రి రాజ‌యోగం.. క‌ర్కాట‌క రాశి వారికి కూడా ఊహించ‌ని విధంగా లాభం చేకూర్చ‌నుంది. ఆర్థికంగా బ‌లోపేతం కావ‌డంతో పాటు కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. ఏ ప‌ని త‌ల‌పెట్టినా అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తారు.

కన్యా రాశి( Virgo )

గజకేసరి రాజయోగ ప్రభావంతో కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వీరి ఇంట శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అవివాహితులకు వివాహ యోగం వలన ఈ యేడాది పెళ్లి కుదిరే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. అదే విధంగా డబ్బు చేతికి అందుతుంది.

Latest News