Nani -Sujeeth | నేచురల్ స్టార్ నాని కంటెంట్ సెలక్షన్‌లో వైవిధ్యం, నటనలో సహజత్వంతో టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి అష్టాచెమ్మాతో హీరోగా పరిచయమైన ఆయన, వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. నిర్మాతగా కూడా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మరోవైపు స్టైలిష్ మేకింగ్‌కు పేరుగాంచిన దర్శకుడు సుజీత్, ఇటీవల ఓజీతో బ్లాక్‌బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే సినీ వర్గాల్లో హైప్ నెలకొంది.
టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో సర్‌ప్రైజ్
నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఇప్పటికే ది ప్యారడైజ్ అప్‌డేట్‌తో జోష్‌లో ఉన్న అభిమానులకు, ఇప్పుడు నాని–సుజీత్ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ మరింత కిక్ ఇచ్చింది. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. వీడియోలో సుజీత్ స్టైలిష్ టేకింగ్ స్పష్టంగా కనిపించగా, నాని పాత్రపై ఆసక్తి పెరిగింది. ‘చిటికెడు కరుణ, పడికెడు కోపం, బారెడు బీభత్సం.. మతిపోయేంత ప్రేమ’ అనే ట్యాగ్‌లైన్‌తో హీరో క్యారెక్టర్‌ను ఇంట్రస్టింగ్‌గా పరిచయం చేశారు.
చెఫ్‌గా గ్యాంగ్‌స్టర్ షేడ్స్
గ్లింప్స్‌ను బట్టి చూస్తే ఇది డార్క్ క్రైమ్ కామెడీ టచ్‌తో కూడిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని ఒక చెఫ్‌గా కనిపించడమే కాకుండా గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా మెప్పించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగం కాదు కానీ రన్ రాజా రన్ తరహాలో స్టైలిష్ ట్రీట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
హీరోయిన్ ఎంపికపై చర్చ
హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి, పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్ (వెంకట్ బోయనపల్లి)తో పాటు నాని సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెట్టి వచ్చే ఏడాది విడుదల చేయాలన్న లక్ష్యంతో టీమ్ ముందుకు సాగుతోంది.
ఒకవైపు ‘ది ప్యారడైజ్’ వంటి మాస్ ప్రాజెక్ట్, మరోవైపు ‘బ్లడీ రోమియో’ వంటి స్టైలిష్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌తో నాని అభిమానులకు డబుల్ ట్రీట్ ఖాయం అన్న మాట వినిపిస్తోంది.
