YuvaGalamPadayatra | లోకేశ్ పాదయాత్రకు నాని, గల్లా డుమ్మా

YuvaGalamPadayatra | విధాత: హోరున సాగుతున్న లోకేశ్ యువ గళం పాదయాత్రలో మెరుపులు, మరకలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది నాయకులు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. మరికొందరు పెద్ద తలకాయలు మాత్రం కావాలనే యాత్రకు డుమ్మా కొడుతున్నారు. గుంటూరు జిల్లా నుంచి కృష్టా బ్యారేజ్ దాటుకుని విజయవాడలో ప్రవేశించిన లోకేశ్ యాత్రకు భారీగా కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే ఈ ఎపిసోడ్ లో ముఖ్యమైన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్కడా […]

  • By: krs    latest    Aug 20, 2023 5:08 PM IST
YuvaGalamPadayatra | లోకేశ్ పాదయాత్రకు నాని, గల్లా డుమ్మా

YuvaGalamPadayatra |

విధాత: హోరున సాగుతున్న లోకేశ్ యువ గళం పాదయాత్రలో మెరుపులు, మరకలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది నాయకులు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. మరికొందరు పెద్ద తలకాయలు మాత్రం కావాలనే యాత్రకు డుమ్మా కొడుతున్నారు.

గుంటూరు జిల్లా నుంచి కృష్టా బ్యారేజ్ దాటుకుని విజయవాడలో ప్రవేశించిన లోకేశ్ యాత్రకు భారీగా కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే ఈ ఎపిసోడ్ లో ముఖ్యమైన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్కడా కనిపించలేదు. అంటే వాళ్ళు ఇప్పటికే పార్టీకి బైబై చెప్పేశారా? తమ దారి తాము చూసుకున్నారా? అన్నది తెలియడం లేదు.