SCR Special Trains | ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు
SCR Special Trains | ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) సందడి మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఉన్న ఏపీ( AP ) వాసులంతా తమ సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) కీలక నిర్ణయం తీసుకుంది.
SCR Special Trains | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) సందడి మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఉన్న ఏపీ( AP ) వాసులంతా తమ సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రైళ్లు( Trains ), బస్సులు, ప్రయివేటు వాహనాల్లో రద్దీ అప్పుడే మొదలైంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రయాణికుల కోసం సంక్రాంతి పండుగకు మరో 11 ప్రత్యేక రైళ్ల( Special Trains )ను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
జనవరి 7 నుంచి 12 వరకు ప్రత్యేక రైళ్లు
ఏపీలోని పలు ప్రాంతాలకు జనవరి 7 నుంచి 12వ తేదీ మధ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు.. కాకినాడ టు వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్-వికారాబాద్, సికింద్రాబాద్-పార్వతీపురం మధ్య రాకపోకలు కొనసాగించనున్నాయి. ఆయా ట్రైన్లలో 1ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయయని వెల్లడించింది. ఆయా రైళ్లకు సంబంధించి బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు తెలిపింది.
వీక్లీ స్పెషల్ రైళ్ల పొడిగింపు
పలు రైల్వేస్టేషన్ల మధ్య ఇప్పటికే నడుస్తున్న వీక్లీ ట్రైన్లను సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-అనకాపల్లి (ట్రైన్ నం.07041) రైలు జనవరి 4, 11, 18వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అనకాపల్లి-సికింద్రాబాద్(నం.07042) రైలు జనవరి 5, 12, 19వ తేదీల్లో, హైదరాబాద్-గోరఖ్‌పుర్(నం.07075) రైలు జనవరి 9, 16, 23వ తేదీల్లో, గోరఖ్‌పుర్-హైదరాబాద్(07076) రైలు జనవరి 11 18, 25న బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram