Anthropic AI Impact | ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం.. ఐబీఎం షేర్లు 13.2 శాతం ఢమాల్

ఆంత్రోపిక్ ఏఐ కంపెనీ దెబ్బకు ప్రముఖ ఐటీ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా ఐబీఎం కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఆంత్రోపిక్ ఏఐలో అప్‌డేట్‌ టూల్‌ను ప్రకటించిన వెంటనే సోమవారం ఐబీఎంకు చెందిన షేర్లు మూడు దశాబ్ధాల్లో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ షేర్ మార్కెట్‌లో 13.2 శాతం కుప్పకూలాయి. ఐబీఎం చరిత్రలో సోమవారం ఒక దుర్దినంగా ప్రమోటర్లు భావించారు.

ibm shares fall anthropic ai impact

Anthropic AI Impact  | ఆధునీకరించిన కోబాల్ క్లాడ్ కోడ్ టూల్‌ను ఆంత్రోపిక్ ఏఐ సోమవారం మార్కెట్లోకి వదిలింది. ఐబీఎం కంప్యూటర్లలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజీగా దీన్ని విరివిగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక ట్రాన్సాక్షన్ల కోసం ఐబీఎం కొన్నేళ్ల నుంచి కోబాల్‌తో ఉన్న కంప్యూటర్లను విక్రయిస్తున్నది. గత ఫిబ్రవరిలో ఐబీఎం షేర్లు 27 శాతం కుప్పకూలిన విషయం తెలిసిందే. 1968 తరువాత కంపెనీ చరిత్రలో ఇంత దారుణంగా షేర్లు పడిపోవడం ఇదే ప్రథమం అని అప్పట్లో యాజమాన్యం ప్రకటించింది. ఫైనాన్స్, ఎయిర్‌లైన్స్‌, గవర్నమెంట్ వ్యవస్థల్లో ప్రతినిత్యం కోబాల్ ఒక టూల్ గా మారిందని ఆంత్రోపిక్ సోమవారం తన పోస్టులో వెల్లడించింది. క్లాడ్ కోడ్‌తో కోబాల్‌ను మరింత వేగంగా పనిచేసేలా చేస్తుందని పేర్కొంది. టెక్ నిపుణులు నెలల పాటు పనిచేసే కోడ్ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు ఆంత్రోపిక్ స్పష్టం చేసింది. కొన్ని దశాబ్ధాల నుంచి ఐబీఎం కంపెనీ కోబాల్ కంప్యూటర్లను విక్రయిస్తున్నది. ఆంత్రోపిక్ సోమవారం విడుదల చేసిన క్లాడ్ కోడ్ తో ఐబీఎం పై ప్రత్యక్షంగా ప్రభావం చూపించింది. ఏఐ తమ కంపెనీల మనుగడకు ముప్పుగా మారనున్నదనే భయాందోళనలను కొన్ని రోజులుగా వెంటాడుతున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ మార్కెట్లను ఇప్పుడు ఆర్టిఫిలిఒఉవుడులనషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భయం ఇప్పుడు వణికిస్తున్నది. గత ఫిబ్రవరి నెలలో ఆంత్రోపిక్ విడుదల చేసిన క్లాడ్ కోడ్ సెక్యురిటీ టూల్ తో పలు కంపెనీలు షేర్లు న్యూయార్క్ సిటీలోని నాస్‌డాక్‌ ఎలక్ట్రానిక్ స్టాక్ మార్కెట్‌లో ఊగిసలాడాయి. సైబర్ సెక్యురిటీ, సాఫ్ట్‌వేర్‌ యాస్ ఏ సర్వీస్ రంగంలో పేరొందిన కంపెనీల షేర్లు పడిపోయాయి. అమెరిక్ మార్కెట్‌లో 285 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి అయిపోయింది. ఒక్కరోజే సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్షియల్ సర్వీసులు, అసెట్ మేనేజ్‌మెంట్ రంగాలకు చెందిన కంపెనీలకు రూ.24 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ దెబ్బకు దేశీయ కంపెనీలు అయిన టీసీఎస్ 6 శాతం, విప్రో 4 శాతం, ఎల్.టీ.ఐ.ఎం 7 శాతం, హెసీఎల్ 5 శాతం, ఇన్ఫోసిస్ 7 శాతం నష్టపోవడం టెక్ కంపెనీల యజమానులను కలవరపెట్టింది.

గోల్డ్ మాన్ శాచ్ విశ్లేషణ ప్రకారం యూఎస్ సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్ ఎన్నడూ లేని విధంగా 6 శాతం పతనం కావడం గమనార్హం. ఆంత్రోపిక్ విడుదల చేస్తున్న ఏఐ టూల్స్ పలు రంగాలను కుదిపేస్తున్నది. సాంప్రదాయ ఐటీ కంపెనీలకు ఏఐ ముప్పుగా పరిణమించిందనేది స్పష్టమవుతున్నది. ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన క్లాడ్ కోవర్క్ టూల్ న్యాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నది. లీగల్ బ్రీపింగ్, కాంట్రాక్టుల రివ్యూ వంటి పనులను ఇది ఆటోమెట్ చేస్తుంది. ఈ రంగంలో థామ్సన్ రాయిటర్స్, లీగల్ జూమ్ వంటి సంస్థలు అందిస్తున్న సేవలకు క్లాడ్ కోవర్క్ టూల్ ప్రధాన పోటీగా మారనున్నది. ఇలా ఒక్కో రంగానికి చెందిన టూల్స్ ను దశల వారీగా మార్కెట్ లోకి ఆంత్రోపిక్ విడుదల చేస్తుండడం మూలంగా ఆ రంగాలపై ఎన్నో దశాబ్ధాలుగా పనిచేస్తున్న సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఫలితంగా కంపెనీల మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నదని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా మున్ముందు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ ఎన్నో ఉపద్రవాలను చూడాల్సి వస్తుందోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Latest News