Earthquake | తుర్కియేలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. తుర్కియే – సిరియాకు సరిహద్దు ప్రాంతంలో భూమికి 1.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూరిపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) పేర్కొంది. తుర్కియేలోని టర్కీలోని దక్షిణ ప్రావిన్స్ హటేలో సోమవారం రెండుసార్లు భూప్రకంపనలు రికార్డయ్యాయి.
తాజా భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయగా.. 213 మంది గాయపడ్డారని తుర్కియే అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. భూకంపం కారణంగా ఇండ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొలన్నది. ప్రకంపనలు భారీగానే ఉండడంతో అనేక భవనాలు మరోసారి దెబ్బతిన్నాయి. హటే ప్రావిన్స్‌లో 6.4, 5.8 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించింది. దాంతో లెబనాన్ రాజధాని బీరూట్‌లో ప్రకంపనలు నమోదయ్యాయి. తుర్కియే – సిరియా సరిహద్దులో సంభవించిన భూకంపం కారణంగా అలెప్పోలో భవనంలో కొంత భాగం కూలిపోవడంతో ఆరుగురు గాయపడ్డారని సిరియా ప్రభుత్వం ఆధీనంలోని మీడియా తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 08.04 గంటలకు 6.4 తీవ్రతతో, ఆ తర్వాత మూడు నిమిషాలకు 5.8 తీవ్రతతో హటాట్ సమందాగ్‌లో భూకంపం కేంద్రాలను గుర్తించినట్లు మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్నీ (AFAD)ని ఉటంకిస్తూ తెలిపింది. భూకంపకాల కారణంగా సముద్ర మట్టం పెరిగే ప్రమాదం ఉండడంతో తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని పౌరులను హెచ్చరిస్తూ ఏఎఫ్‌ఏడీ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గతవారంలో వచ్చిన భారీ ప్రకంపనల ధాటికి దాదాపు 41వేల మందికిపైగా మృతి చెందగా.. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి.