Buddha Vanam |
నాగార్జునసాగర్, ఆగస్టు 19. అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనాన్ని మరిన్ని కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి చేస్తామని పర్యాటక ,సాంస్కృతిక, పురావస్తు ,యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ అన్నారు. బుద్ధవనం పరిశీలనలో భాగంగా శనివారం విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న ముఖ్య కార్యదర్శికి టూరిజం అధికారులు చైతన్య, శ్రీధర్ రెడ్డి, ఎల్లస్వామిలు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం విజయ విహార్ అతిథిగృహం నిర్వహణలో భాగంగా రిసెప్షన్, రెస్టారెంట్ లను తనిఖీ చేశారు. ఆపైన బుద్ధవనం చేరుకున్న ముఖ్య కార్యదర్శికి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధ వనములోని బుద్ధ చరిత వనం, జాతకవనం,ధ్యానవనం ,స్తూపవనాలను ,మహాస్థూపాన్ని సందర్శించారు.
బుద్ధ వనంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన వ్యూ పాయింట్ ను, సైకిల్ ట్రాక్ ను పరిశీలించారు. బుద్ధ వనములో ఇప్పటివరకు చేసిన నిర్మాణాల గురించి కొత్తగా చేపట్టవలసిన నిర్మాణాలకు ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్య కార్యదర్శికి వివరించారు.
బుద్ధవనం పరిశీలనలో భాగంగా రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ మాట్లాడుతూ మొదటిసారిగా బుద్ధవనం పరిశీలకు వచ్చానని బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు చేపట్టినందుకు అభినందించారు. మరిన్ని కొత్త ప్రతిపాదనలతో బుద్ధవనాన్ని త్వరలోనే అభివృద్ధి చేస్తామని అన్నారు.
బుద్ధ వనంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో ఫోటోలు దిగారు. ఆమెతోపాటు బుద్ధవనం ఓఎస్డి సుధాన్ రెడ్డి, ఆర్కిలాజికల్ డిప్యూటీ డైరెక్టర్లు నాగరాజు ,నారాయణ, బుద్ధవనం డీఈలు దామోదర్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి , బుద్ధ వనం డిజైన్ ఇంచార్జ్ శ్యాంసుందర్రావు, టూరిజం గైడ్ సత్యనారాయణ, బుద్ధవనం సిబ్బంది నరసింహారావు, విష్ణు తదితరులు ఉన్నారు.