Haryana Governor Dattatreya
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నాగార్జునసాగర్(Nagarjunasagar)లో నిర్మించిన బుద్ధవనాన్ని మే నెల 5వ తేదీన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Haryana Governor Dattatreya) సందర్శించనున్నట్లుగా బుద్ధవనం(Bhuaddavanam) ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య(Mallepalli Laxmayya) తెలిపారు.
హర్యానా రాష్ట్రం చండీగడ్ రాజభవన్‌లో గవర్నర్ బండారు దత్తాత్రేయను బుద్ధ వనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య మర్యాదపూర్వకంగా కలిసి బుద్ధవనాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానం పలికారు. దీంతో స్పందించిన గవర్నర్ దత్తాత్రేయ మే 5వ తేదీన నాగార్జునసాగర్ లోని బుద్ధ వనములో నిర్వహించే బుద్ధ జయంతి ఉత్సవాలలో పాల్గొంటానని తెలిపారు.