Site icon vidhaatha

Buddha Vanam | బౌద్ధ ధర్మమే ప్రపంచానికి దిక్సూచి: యూజీసీ మాజీ చైర్మన్ సుకుదేవ్ తురాట్

Buddha Vanam

విధాత: ప్రపంచ దేశాలకు బౌద్ధ ధర్మమే దిక్సూచిగా మారి జాతీయ సమైక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడుతుందని యుజిసి మాజీ చైర్మన్ సుఖ దేవ్ తురాటో అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్ లో బుద్ధ వనంలో(Buddha Vanam) 2567వ బుద్ధ జయంతి ఉత్సవాలను తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

బుద్ధ జయంతి సందర్భంగా హైదరాబాదులోని 127 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి 200 కార్ల ర్యాలీతో బుద్ధవనం చేరుకున్న బృందానికి సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. బుద్ధ జయంతి ఉత్సవాలలో భాగంగా బుద్ధవనంలో టిబెట్ హెర్బల్ కేంద్రాన్ని టిబెట్ సాంప్రదాయ బద్ధంగా యూ జి సీ మాజీ చైర్మన్ సుఖదేవ్ తురాటో ప్రారంభించి మాట్లాడారు.

ప్రపంచ దేశాలకు బౌద్ధాన్ని అందించిన ఘనత భారతదేశానికి దక్కిందన్నారు శాంతియుత సమాజానికి బుద్ధుని బోధనలు మార్గదర్శకాలన్నారు. బౌద్ధ ధర్మం అన్ని వర్గాలకు చేరువ కావలసిన ఆవశ్యకత ఉందన్నారు. అంతకుముందు మహా బోధి సొసైటీ సంఘపాల బౌద్ధ బిక్షువుల బృందం, కర్ణాటక బౌద్ధ భిక్షువులతో స్థానిక శాసన సభ్యులు నోముల భగత్ కుమార్ తో కలసి ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలు ఘటించి బుద్ధ వందనాలు నిర్వహించారు.

ఇందులో ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా హాజరయ్యారు. ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య బుద్ధ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ పంపించిన సందేశాన్ని వినిపించారు. అనంతరం ఇల్యూమినేషన్ లైటింగ్‌ను యూజీసీ మాజీ చైర్మన్ సుఖదేవతో కలిసి మల్లెపల్లి లక్ష్మయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో విమల తోరాటో, ప్రొఫెసర్ సంతోష్, బుద్ధవనం ఓ ఎస్ డి సుధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version