Site icon vidhaatha

ఎన్నికల ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్

– టోల్ ఫ్రీ నంబర్ : 040 23238545

– 24 గంటలూ అందుబాటులో సిబ్బంది

– రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరీ

విధాత: రంగారెడ్డి జిల్లా కొంగరకాలన్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను మంగళవారం ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించి మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, జిల్లాలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదుకు ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు.

కంట్రోల్ రూమ్ నంబర్ 040-23238545 కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ఈ కంట్రోల్ రూమ్ లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రిజిష్టర్ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను రికార్డ్ చేస్తూ నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తెలంగాణ శాసనసభ ఎన్నికలు-2023 కు సంబంధించి ఫిర్యాదుల కోసం ఈ టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

Exit mobile version