Site icon vidhaatha

Elon Musk vs Mark Zuckerberg | జుక‌ర్ బ‌ర్గ్ వ‌ర్సెస్ ఎల‌న్ మ‌స్క్..కేజ్ ఫైట్‌కు సిద్ధం

Elon Musk vs Mark Zuckerberg

విధాత‌: ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం టెస్లా అధినేత ఎలన్ మ‌స్క్ ఎట్ట‌కేల‌కు మెటా ఫౌండ‌ర్ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌తో మార్ష‌లార్ట్స్‌ కేజ్ మ్యాచ్ కోసం స్థ‌లాన్ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ఇట‌లీ సాంస్కృతిక శాఖ మంత్రి జిన్నారో సాంగిలియానోతో కేజ్ ఫైట్ గురించి మాట్లాడార‌న్నారు. తాను, సాంగిలియానో ప్ర‌త్యేక ప్ర‌దేశం గురించి ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని శుక్ర‌వారం మ‌స్క్ త‌న సామాజిక మాధ్య‌మ‌మైన‌ Xలో పేర్కొన్నారు.

అయితే మస్క్‌తో సంభాషణ అనంత‌రం సాంగిలియానో ​​మాట్లాడుతూ.. కేజ్ ఫైట్‌ రోమ్‌లో నిర్వహించబడదని చెప్పారు. కాగా ఈ కార్య‌క్ర‌మం జూక‌ర్‌బ‌ర్గ్‌, మ‌స్క్ ఫౌండేష‌న్స్ ద్వారా నిర్వ‌హించ‌బ‌డుతుంద‌ని తెలిపారు.

రెండు ఇటాలియ‌న్ పిడియాట్రిక్ ఆసుప‌త్రుల‌కు అలాగే బాల్య వ్యాధుల‌పై పోరాటం చేస్తున్న ప‌రిశోధ‌న‌ల‌కు చాలా మిలియ‌న్ల యూరోస్ ఈ కార్య‌క్ర‌మంలో రావాల‌ని ఆశిస్తున్న‌ట్లు సాంగిలియానో వెల్ల‌డించారు. దీనిపై మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ఒక రోజు త‌ర‌వాత స్పందిస్తూ లొకేష‌న్ సెండ్ చేయ‌మంటూ ట్వీట్ చేశారు.

Exit mobile version