Site icon vidhaatha

8,500 మంది ఉద్యోగుల‌కు ఎరిక్స‌న్ ఉద్వాస‌న‌?

-వ్య‌య నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టిన సంస్థ‌

విధాత‌: ప్ర‌ముఖ టెలికం ఎక్విప్‌మెంట్ తయారీదారు ఎరిక్స‌న్‌ (ERICSSON).. భారీగా ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని చూస్తున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 8,500 మందిని తీసేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. వ్య‌య నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టిన సంస్థ‌.. అందులో భాగంగానే భారీగా తొల‌గింపుల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం.

ఈ మేర‌కు ఉద్యోగుల‌కు మెమోలు కూడా పంపిన‌ట్లు చెప్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తికూల ఆర్థిక ప‌రిస్థితుల కార‌ణంగా మైక్రోసాఫ్ట్‌ (MICROSOFT), మెటా (META), అల్ఫాబెట్ (ALPHABET) వేల‌ల్లో ఉద్యోగ కోత‌ల‌కు దిగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి ఎరిక్స‌న్ కూడా చేర‌బోతున్న‌ది. ఈ ఏడాది ఆఖ‌రుక‌ల్లా 880 మిలియ‌న్ డాల‌ర్ల ఖ‌ర్చును త‌గ్గించుకునే యోచ‌న‌లో సంస్థ ఉన్న‌ది.

ఇక ఎరిక్స‌న్ ఉద్యోగ తొల‌గింపులు.. టెలికం ఇండ‌స్ట్రీపైనా ప్ర‌భావం చూపవ‌చ్చ‌ని ప‌రిశ్ర‌మ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎరిక్స‌న్‌కు ల‌క్ష‌కుపైనే ఉద్యోగులున్నారు. సంస్థ ప్ర‌ధాన కేంద్రం ఉన్న‌ స్వీడ‌న్‌ (SWEDEN)లో 1,400 మంది ఉద్యోగాల‌ను కోల్పోయే వీలుంద‌ని అంటున్నారు. అత్య‌ధికంగా ఉత్త‌ర అమెరికాలో లే ఆఫ్‌ (LAY OFF)లు ఉండొచ్చ‌ని చెప్తుండ‌గా, భార‌త్‌లోనూ కొలువులు పోయే ప్ర‌మాదం ఉన్న‌ది.

Exit mobile version