Etela Rajender | బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల

Etela Rajender విధాత : మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మంగళవారం అధికారక ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటలకు బీజేపీ అధిష్టానం అధనపు బాధ్యతలను అప్పగించింది. అయితే కొద్ది రోజుల కిందటి వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఈటలను ప్రకటిస్తారనే ప్రచారం చక్కర్లు […]

  • Publish Date - July 4, 2023 / 10:23 AM IST

Etela Rajender

విధాత : మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మంగళవారం అధికారక ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటలకు బీజేపీ అధిష్టానం అధనపు బాధ్యతలను అప్పగించింది.

అయితే కొద్ది రోజుల కిందటి వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఈటలను ప్రకటిస్తారనే ప్రచారం చక్కర్లు కొట్టినప్పటికీ.. బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవ్వరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.