Site icon vidhaatha

TTD | టీటీడీ విజిలెన్స్ అదుపులో నకిలీ ఐఏఎస్‌

విధాత : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అదికారులకు సమాచారం అందించారు. విజిలెన్స్ అధికారులు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Exit mobile version