కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు

  • Publish Date - April 19, 2024 / 04:18 PM IST

రెండవ రోజు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

విధాత, వరంగల్ ప్రతినిధి: మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.మహబూబాబాద్ ఎమ్మెల్యే, డాక్టర్ బానోత్ మురళి నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి లతో కలసి నామినేషన్ వేశారు. ములుగు నియోజకవర్గం, మదనపల్లి గ్రామానికి చెందిన బలరాం నాయక్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బలరాం నాయక్ తో పాటు పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ సెట్ నామినేషన్ ను, ఆధార్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం ,ముదిగొండ గ్రామానికి చెందిన జాటోత్ రఘు నాయక్ సెట్ నామినేషన్ ను, నర్సంపేట నియోజకవర్గం, ఇటుకాలపల్లి గ్రామం, ఏనుగుల తండా కు చెందిన స్వతంత్ర అభ్యర్థి బోడ అనిల్ నాయక్ సెట్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ కు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ రోజు మొత్తంగా 4 నామినేషన్లు దాఖలు కాగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండురోజులకు గాను 5 నామినేషన్లకు గాను 6 సెట్ల పత్రాలు దాఖలు అయినాయి.

ఈ నామినేషన్ ప్రక్రియలో అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులు లెనిన్ వత్సల్ టొప్పో, శ్రీజ, ఎం.డేవిడ్, ఆర్డీఓ లు అలివేలు, నరసింహరావు, ఎం.ఆర్.ఓ లు భగవాన్ రెడ్డి,దామోదర్, శ్వేత, సునీల్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

****

Latest News