Vemulawada |
- అందుబాటులో లేని ఫైర్ ఇంజన్
- మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న స్థానికులు
విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ సమీంలోని ఆలయ వసతి గదుల సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. గదులో నిల్వ చేసిన కొబ్బరి ముక్కలకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కొబ్బరి ముక్కలు ఆరబెట్టిన గది నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండగా, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో వేలం ద్వారా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కి సంబంధించిన కొబ్బరి ముక్కలను జాతర గ్రౌండ్ పరిసరాల్లో ఆర బెడుతుంటారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు సమాచారం.