Site icon vidhaatha

Fire Breaks | అహ్మ‌దాబాద్ ఆస్ప‌త్రిలో ఎగిసిప‌డ్డ అగ్నికీల‌లు.. 100 మంది రోగుల‌కు త‌ప్పిన ప్రాణ‌పాయం

Fire Breaks | గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోరం జ‌రిగింది. బ‌హుళ అంత‌స్తు భ‌వ‌నంలో ఉన్న ఆస్ప‌త్రిలో మంట‌లు చెల‌రేగాయి.

దీంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న 100 మంది రోగుల‌ను హుటాహుటిన బ‌య‌ట‌కు త‌ర‌లించారు. ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేద‌ని, అంద‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డార‌ని ఆస్ప‌త్రి సిబ్బంది తెలిపింది.

ఆస్ప‌త్రి బేస్‌మెంట్‌లో తెల్ల‌వారుజామున 4:30 గంట‌ల‌కు మంట‌లు చెల‌రేగ‌డంతో.. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది.

అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఆస్ప‌త్రి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో కొనసాగుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

Exit mobile version