Site icon vidhaatha

Rajasthan | బ‌ల‌వంతంగా రెండో పెళ్లి.. రెండో భ‌ర్త‌కు రాఖీ క‌ట్టిన యువ‌తి

విధాత‌: రాజ‌స్థాన్ (Rajasthan)లో ఓ యువ‌తి మ‌న‌సారా ప్రేమించిన యువ‌కుడిని మ‌నువాడింది. కానీ ఆ పెళ్లి పెద్ద‌ల‌కు ఇష్టం లేదు. దీంతో బ‌ల‌వంతంగా ఆమెను ఐదు నెల‌ల పాటు నిర్బంధించి, మ‌రో యువ‌కుడితో వివాహం చేశారు. త‌ల్లిదండ్రులు చేసిన వివాహం న‌చ్చ‌క, రెండో భ‌ర్త‌కు ఆమె రాఖీ క‌ట్టింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన త‌రుణ శ‌ర్మ త‌న చిన్ననాటి స్నేహితుడిని గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తోంది. ఇక ఇద్ద‌రూ ప్రేమ వివాహాం చేసుకున్నారు. ఈ పెళ్లి త‌రుణ త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌లేదు.

ఎందుకంటే ఆ యువ‌కుడు వేరే కులానికి చెందిన వ్య‌క్తి కావ‌డం. ప్రేమ పెళ్లి చేసుకున్న ప‌ది రోజుల‌కే త‌రుణ‌ను బ‌ల‌వంతంగా లాక్కొచ్చారు త‌ల్లిదండ్రులు. ఐదు నెల‌ల పాటు ఓ గ‌దిలో నిర్బంధించారు. ఫోన్‌కు దూరంగా ఉంచారు. అంతేకాకుండా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని అంత‌గ‌ర్హ్ ప‌ట్ట‌ణానికి చెందిన బంధువుల అబ్బాయితో త‌రుణ‌కు బ‌ల‌వంతంగా రెండో పెళ్లి చేశారు.

అయితే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన త‌రుణ‌.. ఇటీవ‌లే రాయ్‌పూర్‌లోని ఓ ఆస్ప‌త్రికి వెళ్లింది. అక్క‌డ ఓ వ్య‌క్తి వ‌ద్ద ఫోన్ తీసుకుని, త‌న ప్రియుడికి కాల్ చేసిన జ‌రిగిన ఘోరాన్ని వివ‌రించింది. త‌న‌ను తీసుకెళ్లాల‌ని కోరింది. ఇక రెండో భ‌ర్త‌కు రాఖీ క‌ట్టింది. అయితే మొద‌టి భ‌ర్త వ‌ద్ద‌కు వెళ్లేందుకు రెండో భ‌ర్త జితేంద్ర జోషి స‌హ‌క‌రించాడు. త‌రుణ‌కు ఇది వ‌ర‌కే పెళ్లి అయిన విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని జితేంద్ర జోషి పేర్కొన్నాడు

Exit mobile version