Site icon vidhaatha

Kodali Nani | మెగాస్టార్‌ను విమర్శించలేదు: మాజీ మంత్రి కొడాలి

Kodali Nani | విధాత: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని తాను విమర్శించలేదని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంగళవారం చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు తోట సాయి ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని హాజరయ్యారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి, మాట్లాడారు. నేను ఏం మాట్లాడానో అన్నదానిపై చిరంజీవి, ఆయన అభిమానులు, నేను క్లారిటీగా ఉన్నామని తెలిపారు.

పెద్దాయన చిరంజీవి సలహాలను తాము పాటిస్తానని, తమకు చెప్పినట్లే ఇండస్ట్రీలో ఉన్న పకోడీగాళ్ళకు కూడా చెప్పాలని మాత్రమే నేను చెప్పానని అన్నారు. మేము శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినిపిస్తాయన్నారు. జగన్ గురించి, తమ గురించి ఎవరు మాట్లాడినా చీల్చి చెండాడుతానని, ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును తాను కాదని కొడాలి నాని అన్నారు.

Exit mobile version