Navjot Singh Sidhu | పది నెలల జైలు శిక్ష.. విడుదలైన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

<p>ఓ ఘర్షణ కేసులో పది నెలల జైలు శిక్ష అనుభవించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ విడుదలయ్యారు. నిబంధనల ప్రకారం జైలు శిక్ష సమయంలో సిద్ధూ సత్ప్రవర్తన కారణంగా ముందే ఆయనను విడుదల చేశారు. విడుదల సందర్భంగా పటియాల జైలు వద్ద ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కళాకారుల మధ్య ఆయనకు స్వాగతం పలికారు. #WATCH | Punjab: Dhols being played outside the jail in Patiala […]</p>

ఓ ఘర్షణ కేసులో పది నెలల జైలు శిక్ష అనుభవించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ విడుదలయ్యారు. నిబంధనల ప్రకారం జైలు శిక్ష సమయంలో సిద్ధూ సత్ప్రవర్తన కారణంగా ముందే ఆయనను విడుదల చేశారు. విడుదల సందర్భంగా పటియాల జైలు వద్ద ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కళాకారుల మధ్య ఆయనకు స్వాగతం పలికారు.

34 ఏళ్ల కిందట జరిగిన సంఘటన కు సిద్దూకు ఏడాది కిందట జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 1988 జనవరి 27న పాటియాల పార్కింగ్‌ విషయంలో జరిగిన ఘర్షణలో 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ కేసులో సిద్ధూతో పాటు రూపిందర్‌సింగ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై పలు కోర్టుల్లో విచారణ జరిగి ఏడాది కిందట సుప్రీంకోర్టు 2022 మే నెలలో తీర్పు ఇచ్చింది. మే 20 న సిద్ధూ కోర్టు ఎదుట లొంగిపోయారు. ఆయనను పాటియాల కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో తాజాగా ఆయన విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామం అంటూ ఏమీ లేదని, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పంజాబ్‌ను బలహీనపరిచేందుకు యత్నిస్తే వారే బలహీనంగా మారుతారు. తాను మధ్యాహ్నమే విడుదల కావాల్సింది కానీ ఆలస్యం చేశారన్నారు.

మీడియా వారిని వెళ్లిపోవాలని కోరారు. ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడల్లా ఒక విప్లవం వచ్చింది. ఈసారి ఆ విప్లవం పేరు రాహుల్‌గాంధీ. ఆయన ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేస్తారంటూ సిద్ధూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.