Article 131 | ఆర్టికల్ 131 సవరణ అంటే ఏంటి?.. పంజాబ్‌లో పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ ను తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని పంజాబ్ లోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

supreme-court-upholds-telangana-high-court-order-jerusalem-mattaiah-name-in-vote-for-note-case

రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ ను తీసుకురావాలని కేంద్ర ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని పంజాబ్ లోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశఆలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాజ్యాంగ అధికరణం 131 సవరణ ( Article 131) బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే ఈ బిల్లుపై పంజాబ్ లోని అధికార ఆప్ సహా కాంగ్రెస్ కు చెందిన అమరీందర్ సింగ్ రాజా వారింగ్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ వంటి నాయకులు కూడా కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో ఈ బిల్లులపై అందరి నిర్ణయం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రాజ్యాంగ అధికరణం 131 సవరణ బిల్లు అంటే ఏంటి?

చండీగడ్ ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 ఆధికరణ పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీని అర్ధం ఏంటంటే చండీగడ్ ను ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా చేయడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ మేరకు నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆర్టికల్ 240 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అబివృద్ది, పరిపాలన కోసం నిబంధనలు రూపొందించే అధికారం దీని ద్వారా వస్తుంది. ఇటువంటి నిబంధనలు పార్లమెంట్ చట్టాల మాదిరిగానే ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే చట్టాలను రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. అయితే ఆర్టికల్ 239 A కింద కేంద్రపాలిత ప్రాంతాల కోసం శాసనసభలు ఏర్పాటు చేస్తే శాసనసభ ఫస్ట్ సమావేశాల నుంచి రాష్ట్రపతికి నిబంధనలు రూపొందించే అధికారం ఆగిపోతుంది. ఈ సవరణ అమల్లోకి వస్తే శాసనసభ లేని చండీగఢ్ గా మారనుంది.
ఆర్టికల్ 240లో అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా, నాగర్ హవేలి, డామన్, డయ్యూ, పుదుచ్చేరి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనకున్న ఈ బిల్లు ఆమోదం పొందితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కింద ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు చండీగడ్ కు కూడా నిబంధనలు రూపొందించేందుకు వీలు దక్కుతుంది. ఇది కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది. ఇది లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కిందకు వెళ్తుంది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పరిధిలోనే చండీగడ్ ఉంది.

చండీగడ్ పాలన చరిత్ర

1966 నవంబర్ 1న పంజాబ్ పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు చండీగఢ్‌ను స్వతంత్ర ప్రధాన కార్యదర్శి పరిపాలించారు. 1984 జూన్ 1న టెర్రరిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చండీగడ్ పై పాలనా నియంత్రణను పంజాబ్ గవర్నర్‌కు బదిలీ చేసింది కేంద్రం. ప్రధాన కార్యదర్శి పాత్రను నిర్వాహక సలహాదారు పాత్రగా మార్చింది2016 ఆగస్టులో మాజీ ఐఎఎస్ అధికారి కెజే అల్ఫోన్స్‌ను నియమించడం ద్వారా స్వతంత్ర నిర్వాహకుడిని పునరుద్ధరించడానికి కేంద్రం ప్రయత్నించింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీల న తీవ్ర వ్యతిరేకత తర్వాత ఈ చర్యను వెనక్కి తీసుకున్నారు.

రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

చండీగడ్ విషయంలో కేంద్రం తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాన్ని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పంజాబ్ రాజధానిని తీసుకెళ్లడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న రాజ్యాంగ అధికరణం 131 సవరణ పంజాబ్ ప్రయోజనాలకు విరుద్దమని ఆయన అన్నారు. పంజాబ్ పై కేంద్రం పన్నిన కుట్రను విజయవంతం కాకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. పంజాబ్ గ్రామాలను ధ్వంసం చేసి నిర్మించిన చండీగడ్ ప్రాంతం పంజాబ్ కే చెందుతుంది. మా హక్కును జారవిడుచుకోబోమని ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకులు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ కూడా వ్యతిరేకించారు. ఇది పూర్తిగా అనవసరమైన చర్యగా ఆయన అన్నారు.

చండీగడ్ పంజాబ్ కు చెందింది.. దాన్ని లాక్కోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన చెప్పారు. ఈ బిల్లు పంజాబ్ ప్రయోజనాలకు విరుద్దమైందని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు. కేంద్రం ప్రతిపాదించే బిల్లు గతంలో చండీగడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకున్నట్టేనని ఆయన అన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల మాదిరిగానే చండీగడ్ పై పంజాబ్ కు ఉన్న పరిపాలనా, రాజకీయ నియంత్రణ కూడా తొలగించేందుకు చేసే ప్రయత్నంగా ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. పంజాబ్ కు చండీగడ్ రాజధాని నగరం అనే వాదన శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Latest News