Praneeth Rao | ఎస్ఐబీనీ కుప్పకూల్చిన ప్రణీత్ రావు.. దశాబ్దాల మావోయిస్టు డాటా లాస్

  • Publish Date - April 9, 2024 / 02:31 PM IST

విధాత: ఫోన్ టాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) ఎస్ఐబి కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంతో దశాబ్దాల తరబడిగా ఉన్న మావోయిస్టుల డేటా ధ్వంసమైనట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. 17 కంప్యూటర్లలోని 40 హార్డ్ డిస్క్లను ప్రణత్ రావు ద్వంసం చేయడంతో కొన్ని ఏళ్ల నుంచి ఉన్న మావోయిస్టుల సమాచారం ధ్వంసమైనట్లుగా తేలింది. హార్డ్ డిస్క్లను కట్టర్స్ తో ముక్కలు ముక్కలుగా చేసిన ప్రణీత్రావు కట్ చేసిన హార్దిస్కులను మూసీ నదిలో పడేశాడు.

కాగా.. ధ్వంసమైన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందం డేటాను రిట్రీవ్ చేసేందుకు సాంకేతిక నిపుణులను ఆశ్రయించారు. అయితే డేటా రికవరీ కోసం ప్రయత్నించిన సాంకేతిక నిపుణులు డేటా రికవరీ అసాధ్యమని తేల్చి చెప్పారు. దీంతో దశాబ్దాల నుంచి ఉన్న డేటా లేకుండపోవడంతో ఎస్ఐబి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐబికి మావోయిస్టులు అణిచివేతలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ప్రణీతరావు నిర్వాకంతో మావోయిస్టుల డేటా కోల్పోవడం ద్వారా ఎస్ఐబి సంస్థపరంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నట్లయింది.

అటు ఫోన్ క్యాపింగ్ కి కన్వర్జేన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ టూల్స్ వాడినట్లుగా గుర్తించిన పోలీసులు ల్యాబ్ హార్డ్ డిస్క్లలను పరిశీలించగా అందులో కూడా డేటా లలేకపోవడంతో అవాక్కయ్యారు. కన్వర్జేన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా ప్రణీత్రావు ఏమేం చేశారన్న దానిపై దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు ల్యాబ్ సిబ్బంది రవికుమార్.. శ్రీవల్లి తోపాటు ఇతరులను విచారించాలని నిర్ణయించారు

అటు రాధా కిషన్రావు కస్టడీ 5వ రోజు విచారణను ముగించారు. ఆయన సాగించిన ఫోన్ టాపింగ్ తోపాటు చేసిన బ్లాక్మెయిలింగ్ బెదిరింపులు పై ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా బిఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు దర్యాప్తు బృందం అడుగులేస్తుంది.

Latest News