విధాత : భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై శామీర్‌పేట్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును మల్లారెడ్డి కోరారు. గత వారం క్రితం మల్లారెడ్డితో తొమ్మిది మందిపై బాధిత గిరిజనుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మల్లారెడ్డి తమకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని గిరిజనులు చేసిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. అయితే తనను రాజకీయ కక్ష సాధింపుతోనే కేసులో ఇరికించారని, తాను ఎలాంటి భూకబ్జాకు పాల్పడలేదని మల్లారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. మల్లారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.