Site icon vidhaatha

రేపు కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన


విధాత : నూతన హైకోర్టు భవనం నిర్మాణ పనులకు నేడు బుధవారం సాయంత్రం5.30గంటలకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వై. చంద్ర చుడ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు శంకుస్థాపనకు కావాల్సిన ఏర్పాట్లు చేపట్టారు. రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించింది.


అయితే హైకోర్టు నూతన భవనానికి కేటాయించిన భూములు వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీ భూములు కావడంతో వాటిని వెనక్కి తీసుకుని మరోచోట హైకోర్టుకు భూములు కేటాయించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం వారి ఆందోళనను పట్టించుకోకుండా అవే భూముల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సిద్ధమైంది.

Exit mobile version