Four members of ganjai gang arrested
విధాత: అంతరాష్ట్ర గంజాయి(ganjai) సరఫరా చేస్తున్న 7గురు ముఠా సభ్యుల్లో 4 గురిని(Four members) అరెస్టు(arrest) చేసినట్లుగా రాచకొండ సీపీ డిఎస్ చౌహన్(CP DS Chauhan) తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ – చౌటుప్పల్ ‘ X’ రోడ్డు వద్ద పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లుగా తెలిపారు. ఒడిశా(Odisha), ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తూన్నారని వివరించారు. డీసీఎం(DCM) వాహనంలో ఒక కోటిన్నర విలువ జేసే 400 KG గంజాయి, ఒక కారు, ఒక డీసీమ్, 5 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఒరిస్సా నుండి 400 కిలోల గంజాయి డిసిఎంకు ముందు వెళ్తున్న ఇన్నోవా క్రిస్టాలో ఉన్న వ్యక్తులు దిశా నిర్దేశం చేస్తుంటే డీసీఎంలో ఉన్న వ్యక్తులు వెనుక నుండి డీసీఎం తీసుకొని వస్తారన్నారు. మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ ఏర్పడితే డీసీఎం తిరుగు ప్రయాణం చేస్తారన్నారు. నిందితులపై 8(సి) 20B (11) (C) R/W 29 NDPS act 1985 కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా సీపీ చౌహన్ తెలిపారు.