Gandhi Bhavan
- కర్ణాటకలో 40శాతం కమీషన్లు తీసుకున్న బీజేపీని ఓడించాం..
- అలాగే 30శాతం కమీషన్ల బీఆర్ ఎస్‌ను ఓడిస్తాం..
- ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్
విధాత: తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో ఏవిధంగా 40శాతం కమీషన్లు తీసుకున్న బీజేపీని ఓడించామో అదే విధంగా తెలంగాణలో కూడా ఓడిస్తామన్నారు.
కమీషన్ల గురించి సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడారన్నారు. దళిత బంధు పథకంలో 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం జరిగిందన్నారు. ఈ కమీషన్ల ప్రభుత్వాన్ని ఓడించడానికి కర్ణాటక స్ఫూర్తి, వ్యూహంతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు.