GHMC | Hyderabad
విధాత: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఉంటుందని పేర్కొంది. ఆ తరువాత చెల్లించే వారిపై అపరాధ రుసుం విధిస్తామని GHMC వెల్లడించింది.
గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పనులు చేపట్టిన కార్పొరేషన్ కు నిధుల సమస్య వెంటాడుతున్నది. రాబడి తగ్గిపోవడం, డిపాజిట్లు కరిగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కటకట లాడుతున్నది.
కొన్ని సందర్భాలలో ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు బ్యాంకులలో ఓ.డి ని ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో స్వంత వనరుల ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు ఆస్తి పన్ను తప్ప మరో మార్గం లేకుండా పోయింది.