విధాత, మెదక్ బ్యూరో: సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా తమకు పే స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ మెదక్ జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు బుధవారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మీ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనందున అత్యధిక కూలీలకు అత్యధిక పని దినాలను కల్పించి జిల్లాను ముందంజలో ఉండేందుకు ప్రతి ఉపాధి ఉద్యోగి కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఉపాధి ఉద్యోగులకు సూచించారు.
మంత్రిని కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ రాజ్ కుమార్, ఏపీవోలు మహిపాల్ రెడ్డి, సంతోష్, ఆదినారాయణ, సభ్యులు లక్ష్మణ్, సంపత్, రాము, స్వామి, యాదగిరి, సుధాకర్ తదితరులు ఉన్నారు.