విధాత : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మంగళవారం నుంచే రాయితీ అమల్లోకి రానుందని జీవోలో పేర్కోంది. టూ వీలర్స్ పై 80% , త్రీ వీలర్స్ , ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90% రాయితీని, కార్లు, ఫోర్ వీలర్స్‌పై 60శాతం రాయితీని ప్రకటించింది. పెండింగ్ చలాన్ల రాయితీ జీవో విడుదలతో పెండింగ్‌లో ఉన్న 2.01కోట్ల పెండింగ్ చలాన్ల వసూలుకు మార్గం సుగమమైంది