గోవాలో అక్ర‌మ నిర్మాణాలు.. హీరో నాగార్జున‌కు నోటీసులు

Hero Nagarjuna | టాలీవుడు కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున‌కు గోవాలోని మాండ్రెమ్ గ్రామ పంచాయ‌తీ నోటీసులు జారీ చేసింది. స‌రైన అనుమతులు తీసుకోకుండా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని నాగార్జునకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన‌డం జ‌రిగింది. నిర్మాణ ప‌నులు ఆప‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. నోటీసుల్లో పేర్కొన్న సారాంశం ఇదే.. మాండ్రెమ్ గ్రామ​ పంచాయతీ సర్వే నెం.211/2 బీ ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా మీకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే పనులు […]

  • Publish Date - December 22, 2022 / 01:31 AM IST

Hero Nagarjuna | టాలీవుడు కింగ్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున‌కు గోవాలోని మాండ్రెమ్ గ్రామ పంచాయ‌తీ నోటీసులు జారీ చేసింది. స‌రైన అనుమతులు తీసుకోకుండా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని నాగార్జునకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన‌డం జ‌రిగింది. నిర్మాణ ప‌నులు ఆప‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

నోటీసుల్లో పేర్కొన్న సారాంశం ఇదే.. మాండ్రెమ్ గ్రామ​ పంచాయతీ సర్వే నెం.211/2 బీ ప్రాంతంలో ముందస్తు అనుమతి లేకుండా మీకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంటనే పనులు ఆపకపోతే పంచాయతీ రాజ్​ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. మాండ్రెమ్ స‌ర్పంచ్​ అమిత్​ సావంత్​.. నాగార్జునకు నోటీసులు జారీ చేశారు.

తెలుగు బిగ్ బాస్ సీజ‌న్-6 ఇటీవ‌లే ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఇక త‌ర్వాత రాబోయే బిగ్ బాస్ సీజ‌న్‌లో నాగార్జున క‌నిపించ‌ర‌ని వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం విదిత‌మే. నాగార్జున స్థానంలో నంద‌మూరి బాల‌కృష్ణ లేదా రానా ద‌గ్గుబాటి హోస్ట్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Latest News