విధాత: ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌లో కనీస పశ్చాత్తాపం కనిపించటం లేదు. విచారణలో రోజుకో సంచలన విషయాలు చెబుతున్నాడు. ప్రేమించి వచ్చిన అమ్మాయిని కర్కశంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపినందుకు తప్పు చేశానన్న బాధ కూడా లేదు. పోగా ఏదో కాకతాలీయంగా జరిగన ఘటనగా చెప్పుకొస్తున్నాడు.
శ్రద్ధావాకర్‌తో సంబంధం కొనసాగించే సమయంలోనే మరో 20మంది అమ్మాయిలతో రిలేషన్‌షిప్ కొనసాగించానని తెలపటం అదో ఆటగా కొనసాగించినట్లు అనిపిస్తున్నది. శ్రద్ధా కేసులో తనకు ఉరి శిక్ష పడినా చింత లేదని, స్వర్గంలో నా కోసం దేవ కన్య ఎదురు చూస్తున్నదని చెప్పుకోవటం అతని విపరీత మనస్తత్వానికి నిదర్శనం.