Site icon vidhaatha

బెంబేలెత్తిస్తున్న బంగారం..! మళ్లీ భారీగా పెరిగిన ధర..!

విధాత‌: బంగారం ధరలు పైపైకి కదులుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో భారీగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.750 పెరిగి తులానికి రూ.58,450 చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.810 పెరగడంతో తులం ధర రూ.63,760కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం ధర రూ.64వేల మార్క్‌ను దాటింది.


ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.65,530కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63,760కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,910కి ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,760 పలుకుతున్నది.


మరో వైపు వెండి ధర సైతం భారీగానే పెరిగింది. రూ.1000 పెరగడంతో కిలో రూ.80,500కి చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.83,500కి ఎగిసింది. అయితే, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు పూర్తయ్యింది. ఇకపై వడ్డీ రేట్లు తగ్గుతాయని ఇన్వెస్టర్లు అంచనా వేశారు. ఈక్రమంలో బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో జీవితకాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్‌ 2,092 పలుకుతున్నది. ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తున్నది. ఈక్రమంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.

Exit mobile version