Gold Prices: : ఆల్ టైమ్ రికార్డు ధరలతో మోత మోగించిన బంగారం ధరలు ఐదు రోజుల తర్వాత సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.150తగ్గి రూ.87,550వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరలు రూ.160తగ్గి రూ.95,510వద్ధ ఆగింది. చైన్నై, బెంగుళూరు, న్యూఢిల్లీ, ముంబాయ్ లలోనూ అవే ధరలు కొనసాగుతున్నాయి. దుబాయ్ లో 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.84,288, 24క్యారెట్ల ధర రూ.91,015గా ఉంది. అమెరికాలో రూ.84,220, రూ.89,806వద్ధ ఉంది.
వెండి ధరలు సైతం ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100తగ్గి రూ.1,09,900వద్ధ కొనసాగుతోంది.