Gopi Chand | హీరో గోపీచంద్‌కి.. ఇక హిట్టు కష్టమేనా?

Gopi Chand | మాచో హీరో గోపీచంద్ ఖాతాలో మరో పరాజయం నమోదైంది. ఆయన హీరోగా నటించిన ‘రామబాణం’ చిత్రం శుక్రవారం విడుదలై.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా టాక్‌ని సొంతం చేసుకోలేకపోయింది. దీంతో అంతా ఇక గోపీచంద్‌కు హిట్టు కష్టమేనా? అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే.. దానికి కారణం లేకపోలేదు. గోపీచంద్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మంచి కథలే. ‘ఆక్సిజన్, పంతం, సీటిమార్, పక్కా కమర్షియల్’ ఇలా చాలా […]

  • Publish Date - May 8, 2023 / 04:57 AM IST

Gopi Chand |

మాచో హీరో గోపీచంద్ ఖాతాలో మరో పరాజయం నమోదైంది. ఆయన హీరోగా నటించిన ‘రామబాణం’ చిత్రం శుక్రవారం విడుదలై.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా టాక్‌ని సొంతం చేసుకోలేకపోయింది. దీంతో అంతా ఇక గోపీచంద్‌కు హిట్టు కష్టమేనా? అనేలా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకు అలా అంటున్నారంటే.. దానికి కారణం లేకపోలేదు. గోపీచంద్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మంచి కథలే. ‘ఆక్సిజన్, పంతం, సీటిమార్, పక్కా కమర్షియల్’ ఇలా చాలా సినిమాలు మంచి కథలతో కూడినవే. కానీ ఆ కథలను ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే లోపం జరుగుతుంది.

ఎగ్జిక్యూషన్ ఒక్కటే కాదు.. ఆయన యాక్టింగ్‌లో కూడా మార్పు ఉండటం లేదు. ప్రతి సినిమాకు ఒకటే గెటప్, ఒకటే నటన.. ఎటువంటి వైవిధ్యతను చూపించక పోవడం గోపీచంద్‌ పరాజయానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.

తాజాగా వచ్చిన ‘రామబాణం’ సినిమాలో ఉన్న కథని.. నేటి జనరేషన్‌కి కావాల్సిన విధంగా తెరకెక్కించినట్లయితే ఖచ్చితంగా గోపీచంద్‌కు హిట్టు పడేదే. హిట్ కాకపోయినా ఖచ్చితంగా మంచి సినిమా అనే పేరు అయినా వచ్చేది. అయితే సినిమాలో చాలా చోట్ల గోపీచంద్ డైలాగ్ చెప్పిన తీరు చూస్తుంటే.. సరికొత్త డౌట్స్‌కు దారి తీస్తోంది. ఏంటా డౌట్స్ అనుకుంటున్నారా?

సినిమాలో సీరియస్‌గా భారీ డైలాగ్ చెప్పే క్రమంలో ఆయన మూతిని ఒక రకంగా పెట్టడం చూస్తుంటే.. గోపీచంద్ ఏదైనా ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నాడా? అని అనిపిస్తుంది. ఎందుకంటే గోపీచంద్ అలా డైలాగ్ చెబుతున్నప్పుడు.. చూడలేని పరిస్థితి. మొత్తంగా అయితే గోపీచంద్ ఇప్పుడొక్కసారి తన సినిమాలను, నటనను వెనుదిరిగి చూసుకుంటే మంచిది.

మంచి సబ్జెక్ట్‌ను ఎన్నుకుని కూడా హిట్టు కొట్టలేకపోవడానికి కారణం ఏమిటనేది ఆయన చెక్ చేసుకోవాలి. అలాగే భారీతనం తగ్గించి.. తక్కువ ఖర్చుతో మంచి ప్రొడక్ట్ వచ్చేలా.. ఇప్పుడు చిన్న హీరోలు కొందరు చేస్తున్న సినిమాల మాదిరిగా.. ఆయన పంథా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదు, కాదు కూడదు అంటే మాత్రం.. ఈ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇక తేజ చెప్పినట్లుగా టి. కృష్ణ పేరు కూడా ఆయనని కాపాడలేదు. అదీ విషయం.