అనకొండతో.. గవర్నర్‌ తమిళిసై

  • Publish Date - October 4, 2023 / 10:49 AM IST
  • ప్రపంచ జంతు దినోత్సవంలో సందడి


విధాత : ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై వన్యప్రాణులు, సరీసృపాలతో సందడి చేశారు. భారీ అనకొండను స్వయంగా చేతుల్లోకి తీసుకుని వన్యప్రాణుల పట్ల తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా అనకొండతో కూడిన ఫోటోకు తన సందేశాన్ని జోడించి ట్వీట్ చేశారు. ప్రపంచంలో మానవుల జీవితం, జీవనోపాధి ఎంత ముఖ్యమైనదో, జంతువుల జీవితం, జీవనశైలి కూడా అంతే ముఖ్యమైనదన్నారు.


జంతువులకు హాని కలగకుండా ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించేందుకు మానవులమైన మనమందరం జంతువులకు అండగా ఉండాలన్నారు. జంతువులను రక్షించడం, వాటిపై క్రూరత్వాన్ని నిరోధించడం గురించి అవగాహన కల్పించడానికి అక్టోబర్ 4 న ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ఈ స్ఫూర్తితో వన్యప్రాణుల పట్ల అంతా సానుకూల దృక్పథంతో  కొనసాగాలన్నారు.