Viral Video | అమెజాన్ అడవుల్లో అతిపెద్ద అనకొండ వీడియో వైరల్

అమెజాన్ అడవుల్లో భారీ అనకొండ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 20 మీటర్ల పాము వీడియో.. ఇది నిజమా లేక ఏఐ సృష్టించిన నకిలీదా?

Anaconda

విధాత : భారీ అనకొండలకు అమెజాన్ అడవి నెలవుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ అడవుల్లో అనకొండలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఆసక్తిరేపుతుంటుంది. పరిశోధకులు అమెజాన్ అడవులలో జీవజాతులపై సాగిస్తున్న పరిశోధనలు ప్రపంచానికి తరుచూ కొత్త విషయాలను వెల్లడిస్తుంటాయి. తాజాగా ఓ భారీ అనకొండ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొమ్మిది మీటర్ల కంటే అధిక పొడవు ఉన్న ఈ భారీ అనకొండను సమీపంగా వీడియో తీసినట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియో రెండు రోజుల్లోనే 14మిలియన్ల వ్యూస్ సాధించడం ఆసక్తికరం.

వీడియోలో భారీ అనకొండ పామును చూసిన నెటిజన్లు దాని పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అనకొండ సినిమాలో చూపించినట్లుగానే ఆ భారీ అనకొండ కనిపిస్తుందంటున్నారు. అయితే ఈ వీడియో నిజమైంది కాదని, ఎఐ జనరేటెడ్ ఎడిట్ వీడియో కావచ్చని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజమైన భారీ అనకొండలు వాటి 250కిలోల బరువు కారణంగా నీటిలోకి దిగగానే మునిగి పోతాయి. అంతేకాదు వాటి గరిష్ట పొడవు 9మీటర్ల కంటే ఎక్కువగా 20మీటర్లు పొడవుతో అనకొండ ఉన్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తుందని అందుకే ఈ వీడియో ఫేక్ వీడియోగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకు ఈ భారీ అనకొండ వీడియో అసలైందా..నకిలీదో మీరు ఈ వీడియో చూస్తే స్పష్టత వస్తుంది.

ఇవి కూడా చదవండి :

Gold, Silver Price Increas| వెండి జోరు.. 24రోజుల్లో రూ.1లక్ష 4వేలు పెరుగుదల
Ram Charan | బాబాయి కోసం అబ్బాయి త్యాగం.. రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ మూవీ వాయిదా?

Latest News