విధాత: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 8,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా, రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్ -4 పరీక్షను జులై 1వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ నిన్ననే ప్రకటించింది.
అయితే గ్రూప్ -4 దరఖాస్తుల గడువు జనవరి 30వ తేదీతో ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో మూడు రోజుల పాటు దరఖాస్తుల గడువు పొడిగించింది. జనవరి 30 నాటికి 8,47,277 దరఖాస్తులు రాగా, ఈ మూడు రోజుల వ్యవధిలోనే 1,04,044 దరఖాస్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తుల సంఖ్య 9,51,321కి చేరింది.