Kochi Coast High Alert: : లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో మునిగిపోయిన ప్రమాదంతో ఇండియన్ కోస్టు గార్డ్ హై అలర్ట్ ప్రకటించింది. మునిగిపోయి నౌకలో 640 కంటైనర్లు ఉండగా.. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది. ఇవి లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్ల నుంచి ఇంధనం..రసాయనాలు బయటకు వస్తే తాకవద్ధని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధన లీకేజీలపై సర్వే చేపట్టారు.
విఝింజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన లైబీరియా ఎంఎస్సీ ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నం కొచ్చిన్ తీరం చేరాల్సిఉంది. అయితే ఆ నౌక తీరానికి 38నాటికల్ దూరంలో ఓ వైపు ఒరిగా ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న ఇండియన్ కోస్టు గార్డు సహాయక చర్యలు చేపట్టి నౌకలో ఉన్న 24మంందిని సురక్షితంగా తీరానికి చేర్చారు. అయితే అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి.