Site icon vidhaatha

Bollywood | ఇండస్ట్రీలో.. డబ్బులు ఎక్కువగా తీసుకొనే హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Bollywood

విధాత‌: ప్రపంచంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమల్లో ఒకటి బాలీవుడ్. ప్రతిభావంతులైన న‌టీన‌టుల ఉత్ప‌త్తి కేంద్రం బాలీవుడ్‌. హీరో, హీరోయిన్లు అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకొనే వేదిక కూడా బాలీవుడ్‌. ఇక్క‌డ కొందరు ఒక్కో ప్రాజెక్ట్‌కు కోట్ల‌లో డ‌బ్బులు సంపాదిస్తారు.

బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్ ఎవ‌రో తెలుసా? దీపిక, అలియా, ఐశ్వర్య, కంగనా, అనుష్క, కత్రినా, సమంత, నయనతార.. వీరిలో ఎవ‌రూ కాదు.

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ప్రియాంక చోప్రా జోనాస్‌. ఆమె ఒక్కో సినిమా/ప్రాజెక్టుకు 15 కోట్ల నుంచి రూ.40 కోట్లు తీసుకుంటుంది.

ఇంట‌ర్‌నెట్ మూవీ డాటాబేస్ (ఐఎండీబీ) గ‌ణాంకాల ప్ర‌కారం టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనాస్‌. ప్ర‌స్తుతం ఈమె బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ న‌టిస్తున్న‌ది.

దీపికా పదుకొణె..

దీపికా పదుకొణె 5 జనవరి 1986న జన్మించారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరు దీపిక‌. ఆమె ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంది.

కంగనా రనౌత్..

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌, క్వీన్ స్టార్ కంగనా రనౌత్ ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.27 కోట్లు తీసుకుంటుంది. బాలీవుడ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఒకరు.

కత్రినా కైఫ్..

జిందగీ నా మిలేగీ దొబారా సినిమా స్టార్.. కత్రినా కైఫ్. బాలీవుడ్ అత్యంత విజయవంతమైన నటీమణుల్లో ఒకరు. ఆమె ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.21 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంది.

అలియా భట్..

మార్చి 15, 1993లో జ‌న్మించిన అలియా భట్.. ప్రస్తుత తరం ఉత్త‌మ హీరోయిన్‌గా పేరుగాంచింది. రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా భట్.. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటుంది.

అనుష్క శర్మ..

స్టార్ క్రికెట‌ర్ విరాట్‌కోహ్లీ భార్య‌గా, బాలీవుడ్ హీరోయిన్‌గా అనుష్క శర్మ ప్ర‌త్యేక స్టార్‌డ‌మ్ సంపాదించుకున్న‌ది. ఆమె ఒక సినిమాకు రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు వసూలు చేస్తున్న‌ది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్..

బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నటీమణుల్లో ఒకరు ఐశ్వర్యరాయ్ బచ్చన్. ఆమె సీనియ‌ర్ న‌టి. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంది.

నయనతార..

దక్షిణ భారత సినీ ఇండ‌స్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరు నయనతార. ఆమె బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌తో క‌లిసి రాబోయే చిత్రం జవాన్‌లో కూడా న‌టిస్తున్న‌ది. నయనతార ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుంది.

సమంత రూత్ ప్రభు..

సమంత‌ రూత్ ప్రభు ప్రధానంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న‌ది. ఆమె పారితోషికం ఒక్కో సినిమా/సిరీస్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్లు వ‌ర‌కు వ‌సూలు చేస్తున్న‌ది.

రష్మిక మందన్న..

పుష్ప సినిమాతో ఒక్క‌సారిగా స్టార్‌డ‌మ్ పెంచేసుకున్న‌ నటి రష్మిక మందన్న. ఆమె సంపాద‌న నికర విలువ రూ.65 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. అనేక బ్రాండ్ల ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తున్న‌ది.

పూజా హెగ్డే..

బాలీవుడ్‌, టాలీవుడ్ రాణిస్తున్న పూజ‌ నికర ఆదాయం విలువ రూ. 50 కోట్లకు చేరుకుంది. ఈ నటి ఒక్కో సినిమాకు దాదాపు రూ.3 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. సినిమాలే కాకుండా.. పూజ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తున్న‌ది.

కృతి సనన్..

కృతి సనన్ ఒక్కో సినిమా ఫీజుకు రూ. 4 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తుంది. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరిగా ఆమె పేరు గ‌డించింది.

కియారా అద్వాణీ..

కైనాఅడ్వాణీ టాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాల్లోనూ నిల‌క‌డ‌గా రాణిస్తున్న‌ది. ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల‌వ‌ర‌కు వ‌సూలు చేస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో నాలుగు ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి.

Exit mobile version