Hyderabad | దిల్‌షుక్‌నగర్‌లో.. జీఎస్టీ అధికారుల కిడ్నాప్! కాపాడిన పొలీసులు

Hyderabad విధాత: జీఎస్టీ కట్టని వ్యవహారంలో షాప్ సీజ్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు అధికారులను కిడ్నాప్ చేసిన వైనం కలకలం రేపింది. హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఓ షాపు నిర్వాహకులు జీఎస్టీ చెల్లించక పోవడంతో జీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు మణిశర్మ, ఆనంద్ లు షాప్ సీజ్ చేసేందుకు వెళుతుండగా షాప్ నిర్వాహకులు వారిని బలవంతంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. విషయం తెలసుకున్న జీఎస్టీ ఉన్నతాధికారులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన […]

  • Publish Date - July 5, 2023 / 09:41 AM IST

Hyderabad

విధాత: జీఎస్టీ కట్టని వ్యవహారంలో షాప్ సీజ్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు అధికారులను కిడ్నాప్ చేసిన వైనం కలకలం రేపింది. హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఓ షాపు నిర్వాహకులు జీఎస్టీ చెల్లించక పోవడంతో జీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు మణిశర్మ, ఆనంద్ లు షాప్ సీజ్ చేసేందుకు వెళుతుండగా షాప్ నిర్వాహకులు వారిని బలవంతంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు.

విషయం తెలసుకున్న జీఎస్టీ ఉన్నతాధికారులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్లను చేజ్ చేసి వారిని కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఆరా !

దిల్‌షుక్ నగర్ పరిధి సరూర్ నగర్‌లో జీఎస్టీ వసూళ్ల కోసం వెళ్లిన ఇద్దరు అధికారులను కిడ్నాప్ చేసిన ఉదంతంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. రాష్ట్ర డీజీపీపి, ఎల్బినగర్ డీసీపీలతో ఫోన్లో విషయం తెలుసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ వ్యవహారంలో పోలీసులు సకాలంలో స్పందించి నిందితులను పట్టుకుని బాధిత అధికారులను క్షేమంగా విడిపించారు.

Latest News