Site icon vidhaatha

Lavanya: పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తాను: లావణ్య

Lavanya:  నటుడు రాజ్ తరుణ్, శేఖర్ బాషాలు నా ఇంటిపై పదే పదే దాడులు చేయిస్తూ.. నన్ను చంపాలని చూస్తున్నారని..ఎవరి చేతిలోనే చనిపోయే బదులు నేను పోలీస్ స్టేషన్ ముందే నా ప్రాణాలు విడుస్తానని లావణ్య వాపోయారు. శనివారం నార్సింగ్ పీఎస్‌కు వచ్చిన లావణ్య మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి కూడా కొంత మంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్, అతడి తల్లితండ్రుల మీద నేను ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.


పోలీసులు నాకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. నా ప్రాణం పోయాక మీరు చర్యలు తీసుకుంటారా అని లావణ్య ప్రశ్నించారు. కోర్టులో ఉన్న ఇంటి వివాదంపై రాజ్ తరుణ్, శేఖర్ బాషాలు దౌర్జన్యం చేస్తున్నప్పటికి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రతిసారి 100ఫోన్ చేసి సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ప్రతి నిమిషం ప్రాణభయంతో బతకాల్సివస్తుందన్నారు. నా సమస్యపై పోలీస్ కమిషనర్ స్పందించాలన్నారు.

Exit mobile version