Site icon vidhaatha

Viral | పోలీస్ స్టేషన్‌కు చిరుతపులి! ఖంగుతిన్న పోలీసులు (వీడియో)

Viral | Leopard

విధాత: జనం పోలీస్ స్టేషన్ కు తమ సమస్యలపై వెళ్లడం అందరికి తెలిసిందే..అప్పుడప్పుడు పట్టుబడిన పందెం కోళ్లను కూడా పోలీస్ స్టేషన్ లలో చూస్తుంటాం. కాని ఓ పోలీస్ స్టేషన్ కు మాత్రం ఏకంగా చిరుతపులి రావడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీస్ స్టేషన్‌లోకి చిరుతపులి వెళ్లింది. దర్జాగా పోలీస్ స్టేషన్ మొత్తం తిరిగి ఎవరు లేకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. చిరుతపులిని గమనించిన కానిస్టేబుల్ అశ్చర్యానికి, భయానికి గురై దాని కంటపడకుండా ఉండి..అది బయటకు వెళ్ళగానే తలుపులు మూసివేశాడు. చిరుతపులి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

చిరుతపులి పక్క గదిలో ఉన్న కానిస్టేబుల్ ను గమనించి ఉంటే అతని పరిస్థితి ఏమిటోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బహుశా పోలీస్ స్టేషన్ అంటే దానికి కూడా భయముండి ఉంటుందని..అందుకే ఎరక్క పోయి వచ్చానని తెలుసుకుని వచ్చిన దారినే వెళ్లి ఉంటుందని మరికొందరు ఫన్ని కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version