Site icon vidhaatha

లావణ్య ఇంటి ముందు.. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ధర్నా

విధాత: హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఇంటి ముందు ధర్నాకు దిగారు. లావణ్య తమను బయటకు గెంటేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అంటున్నారు. ప్రస్తుతం తాము ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ కొన్నాడని ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఇంటిని రాజ్ తన పేరు మీద రాశాడని లావణ్య ఆరోపిస్తోంది.

మరోవైపు లావణ్య ఈ వివాదంపై స్పందిస్తూ నన్నే ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి 15 మంది ప్రయత్నించారని ఆరోపించారు. వారు తనపై దాడికి దిగి.. అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపింది. తనను కొడుతున్నప్పటికి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆపలేదని వివరించింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని లావణ్య పేర్కొంది.

గతంలో కోటిన్నర పెట్టి కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు 12కోట్లు అయ్యిందని.. దీంతో ఇంటిని నా నుంచి లాగేసుకునేందుకు వివాదం చేస్తున్నారని ఆరోపించింది. కొన్ని నెలల క్రితం లావణ్య తాను, రాజ్ తరుణ్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని..తనను రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ కేసులు పెట్టింది. వాటి నుంచి రాజ్ తరుణ్ కోర్టు ద్వారా తాత్కాలిక ఊరట పొందారు. మళ్లీ ఇంటి విషయంలో గొడవ రేగింది. రాజ్ తరుణ్ నటించిన పాంచ్ మీనార్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.

Exit mobile version