Site icon vidhaatha

TDP | టీడీపీ వస్తే.. మహిళలకు బస్సులో ఫ్రీ ప్రయాణం..!

విధాత‌: ఈసారి ఎలాగైనా గెలవాలి.. అధికారం చేపట్టాలని తలపోస్తున్న TDP కొత్త కొత్త పథకాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కొత్త కొత్త పథకాలు తెచ్చి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. మొన్నామధ్య మహానాడులో మినీ మ్యానిఫెస్టో అంటూ కొన్ని పథకాలు విడుదల చేశారు.

అమ్మకు వందనం.. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటూ చంద్రబాబు ప్రకటించగా అందులో అమ్మకు వదనం అనేది ఆల్రెడీ జగన్ అమలు చేస్తున్న పథకం అని, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనేది కర్ణాటకలో బిజెపి ఇచ్చిన హామీల్లో ఒకటి అని గుర్తించిన ప్రజలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఇక ఇప్పుడు టిడిపి తరఫున టిడిపి తిరుపతి ఇంచార్జి సుగుణమ్మ ఇంకో కొత్త పథకాన్ని తెచ్చేందుకు రెడీ అంటూ తన ఫెసుబుక్కు ఆకౌంట్‌లో పోస్ట్ చేశారు. అచ్చం కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్నట్లే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ ఒక పథకం తీసుకొస్తామని సుగుణమ్మ అంటున్నారు.

ఇక కర్ణాటకలో మహిళలకు ఫ్రీ అనగానే బస్సులు ఎలా కిక్కిరిసి పోతున్నాయన్నది చూస్తున్నాం. ఇక ఆంధ్రాలో సైతం ఆర్టీసీని ముంచేస్తారా అని సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలైంది. ఆ మీరు వచ్చినపుడు, గెలిచినప్పుడు కదా అని కొందరు, మహిళలు ఫ్రీగా తిరిగితే మరి ఆ నష్టం ఎలా భర్తీ చేస్తారు.. టికెట్స్ రేట్స్ పెంచుతారా అని కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు

Exit mobile version