Imran Khan | పాక్‌ ప్రధాని నివాసంపై పెట్రోబాంబులతో ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల దాడి..!

Imran Khan | పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అల్‌ ఖదీర్‌ ట్రస్టు కేసులో ప్రభుత్వం అరెస్టు చేసింది. పీటీఐ మద్దతుదారులు ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టును నిరసిస్తూ పాక్‌ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో పాటు వీధుల్లో రణరంగం సృష్టించారు. ప్రభుత్వంలోని సీనియర్ ఆర్మీ అధికారులు, మంత్రుల ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు దిగుతున్నారు. లాహోర్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసంపై ఇమ్రాన్ మద్దతుదారులు బుధవారం దాడి చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి […]

  • Publish Date - May 11, 2023 / 02:52 AM IST

Imran Khan | పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అల్‌ ఖదీర్‌ ట్రస్టు కేసులో ప్రభుత్వం అరెస్టు చేసింది. పీటీఐ మద్దతుదారులు ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టును నిరసిస్తూ పాక్‌ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో పాటు వీధుల్లో రణరంగం సృష్టించారు. ప్రభుత్వంలోని సీనియర్ ఆర్మీ అధికారులు, మంత్రుల ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు దిగుతున్నారు. లాహోర్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసంపై ఇమ్రాన్ మద్దతుదారులు బుధవారం దాడి చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి చెందిన 500 మందికిపైగా మద్దతుదారులు బుధవారం మోడల్ టౌన్ లాహోర్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుని అక్కడ పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రధాని ఇంటిపై పెట్రోల్ బాంబులు కూడా విసిరారని పంజాబ్ పోలీసు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ సమయంలో ప్రధాని నివాసం వద్ద కేవలం గార్డులు మాత్రమే ఉన్నారు. అక్కడున్న పోలీసు పోస్టుకు కూడా నిప్పు పెట్టారు. భారీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకోగానే పీటీఐ ఆందోళనకారులు పారిపోయారని తెలిపారు.

ఇదిలా ఉండగా.. మరో వైపు ఆసియా మిలిల్‌ ఈస్ట్‌ బ్రిడ్జ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 32 మంది సభ్యులతో కూడిన భారత జట్టు లాహోర్‌కు వెళ్లింది. ప్రస్తుతం పాక్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాక్‌లోని భారత హైకమిషన్‌ సరైన భద్రత కల్పించాలని కోరింది. అదే సమయంలో భారత ఆటగాళ్లను తిరిగి భారత్‌కు పంపేలా చూడాలని పాక్‌ అధికారులకు సూచించింది. వాస్తవానికి మే 5న ప్రారంభమైన ఈ టోర్నీ 13 వరకు జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు వాఘా సరిహద్దు నుంచి పాక్‌కు వెళ్లింది.

Latest News