Site icon vidhaatha

MLC KAVITHA | కొండగట్టు అంజన్న సన్నిధిలో.. ఎమ్మెల్సీ కవిత చాలీసా పారాయణం

MLC KAVITHA |

విధాత బ్యూరో, కరీంనగర్: కొండగట్టు అంజన్న సన్నిధిలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఎమ్మెల్సీ కవిత. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 41 రోజుల పాటు 108 సార్లు చేపట్టిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి కవిత పారాయణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 11 సార్లు కవిత హనుమాన్ చాలీసా పఠించారు. అంజన్న దర్శనానికి ముందు ఆమె భేతాళుడిని దర్శించుకున్నారు. తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లినా ఆంజనేయుడి గుడి ఉంటుందని కవిత చెప్పారు. ఆంజనేయుడిని కొలవడం ద్వారా ఆనందం, ఉత్సాహం పెల్లుబుకు తుందన్నారు. అందుకే తెలంగాణలో వేలాది మంది యువత హనుమాన్ దీక్ష దారణ చేస్తారని చెప్పారు.

కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలని కోరగా, హనుమాన్ పారాయణానికి మించింది లేదని స్థానిక ఆచార్యులు చెప్పారని, నాటి నుంచి నేటి వరకు కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగిస్తున్నామన్నారు.

Exit mobile version